Feb 16,2023 22:09

ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌ నేటినుంచే..
ఉదయం 9.30గం||ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

న్యూఢిల్లీ: తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచిన టీమిండియా.. ఇక రెండో టెస్ట్‌పై దృష్టి సారించింది. చాలారోజుల తర్వాత ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుండడంతో భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే రెండోటెస్ట్‌ మ్యాచ్‌ టికెట్లన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఆన్‌లైన్‌లో సుమారు 24వేల టికెట్లు పెట్టగా తొలిరోజుల ఆటకు సంబంధించి టికెట్లన్నీ అయిపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగే రెండో టెస్ట్‌మ్యాచ్‌లోనూ భారత్‌ గెలిస్తే.. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు భారత్‌ చేరువ కానుంది. తొలిటెస్ట్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ సంయుక్తగా చెలరేగడంతో భారతజట్టు సునాయాసంగా గెలిచింది. తొలిటెస్ట్‌ జరిగిన నాగ్‌పూర్‌ పిచ్‌ మాదిరిగానే.. ఫిరోజ్‌ షా మైదానం కూడా స్పిన్నర్లకు అనుకూలించనుంది. ఈ మైదానంలో ఇరుజట్లు 7సార్లు తలపడగా.. భారతజట్టు 3టెస్టుల్లో గెలిచి ఒక్క టెస్ట్‌లో మాత్రమే ఓటమిపాలైంది. 2013లో ఈ మైదానంలో ఆడిన చివరి మ్యాచ్‌లో భారతజట్టు ఆస్ట్రేలియాపై గెలిచింది. ఇక ఆస్ట్రేలియాజట్టు విషయానికొస్తే.. సీనియర్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌కు తోడు.. యువ స్పిన్నర్‌ మర్ఫీపైనే ఆశలు పెట్టుకుంది.
జట్లు(అంచనా)..
భారత్‌: రోహిత్‌(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌, కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), పుజారా, శ్రేయస్‌, కోహ్లి, అక్షర్‌/అశ్విన్‌, జడేజా, సిరాజ్‌, షమీ.
ఆస్ట్రేలియా: పాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), స్మిత్‌, వార్నర్‌/అగర్‌, మర్ఫీ, క్యారీ(వికెట్‌ కీపర్‌), గ్రీన్‌, హ్యాండ్‌కోంబ్‌, హేజిల్‌వుడ్‌, ఖవాజా, లబూషేన్‌, లియాన్‌,