Jul 08,2023 22:12

బార్బొడాస్‌: భారత్‌తో జరిగే తొలిటెస్ట్‌కు వెస్టిండీస్‌ జట్టును కరేబియన్‌ బోర్డు ప్రకటించింది. తొలి టెస్టు కరేబియన్‌ బోర్డు ప్రకటించిన జట్టులో బాహుబలి రకీం కార్న్‌వాల్‌ చోటు దక్కించుకున్నాడు. కెప్టెన్‌గా క్రెగ్‌ బ్రాట్‌వైట్‌ కొనసాగనున్నాడు. విండీస్‌ ప్రకటించిన 13మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్లు అథనాజ్‌, మెకంజీలు తొలిసారి జట్టులో స్థానం దక్కించుకున్నారు. కాగా, రకీం కార్న్‌వాల్‌ 2021 తర్వాత దేశానికి ప్రాతినిథ్యం వహిస్తుండటం ఇదే మొదటిసారి. ఆల్‌రౌండర్‌ అయిన రకీం.. 2019లో భారత జట్టుపైనే ఆరంగేట్రం చేయడం విశేషం. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ ట్వీకర్‌ జోమెల్‌ వారికన్‌కు జట్టులో స్థానం కల్పించారు. వీరితోపాటు రిజర్వ్‌ ఆటగాళ్లుగా టెవిన్‌ ఇమ్లాచ్‌, అకీమ్‌ జోర్డాన్‌ ఉన్నారు. ఈ నెల 12 నుంచి భారత్‌ావెస్టిండీస్‌ జట్ల మధ్య రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బార్బొడాస్‌ వేదికగా తొలిటెస్ట్‌ ప్రారంభం కానుంది.
తొలి టెస్టుకు విండీస్‌ జట్టు: క్రెగ్‌ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌ (వైస్‌ కెప్టెన్‌), అలిక్‌ అథనాజ్‌, తగ్‌నరన్‌ చందర్‌పాల్‌, రకీం కార్న్‌వాల్‌, జాషువా డా సిల్వా, షానన్‌ గాబ్రియేల్‌, జేసన్‌ హౌల్డర్‌, అల్జారీ జోసఫ్‌, కిర్క్‌ మెకంజీ, రేమన్‌ రీఫర్‌, కీమర్‌ రోచ్‌, జోమెల్‌ వారికాన్‌.