Jun 02,2023 06:05

బెంగళూరు: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా భారత పురుషుల హాకీ జట్టు శుక్రవారం కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. శుక్రవారం జరిగిన తొలి లీగ్‌ పోటీలో భారతజట్టు పటిష్ట బెల్జియంతో తలపడనుంది. శనివారం గ్రేట్‌ బ్రిటన్‌తో తలపడనుంది. బెల్జియం జట్టు ఈ లీగ్‌లో ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లోనూ 2-1, 4-2, 2-1, 4-2తో విజయాలను నమోదు చేసుకొని అద్భుత ఫామ్‌లో ఉండడం విశేషం. ఈ లీగ్‌లో భారత జట్టు రెండోస్థానంలో ఉండగా.. బెల్జియం జట్టు అగ్రస్థానంలో ఉంది. ఈ క్రమంలో నేడు బెల్జియంతో జరిగే మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని భారతజట్టు ప్రొ లీగ్‌లో మరో ఆరు మ్యాచులు ఆడాల్సి ఉంది. సెప్టెంబర్‌లో పారిస్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌కు, ఆసియా క్రీడల సన్నాహానికి ఈ సిరీస్‌ భారత్‌ ఆటగాళ్ల సన్నద్ధతకు ఉపయోగపడనుందని హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపాడు. తొలి అంచెలో భారతజట్టు నెదర్లాండ్స్‌, అర్జెంటీనాలతో ప్రొ లీగ్‌ మ్యాచ్‌లను ఆడింది.