ఏసిసి ఎమర్జింగ్(అండర్-19) ఆసియాకప్ రేపటినుంచే..
కొలంబో: ఏసిసి ఎమర్జింగ్ ఆసియాకప్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నమెంట్ ఈనెల 23న ప్రేమదాస స్టేడియంలో జరిగే ఫైనల్‌తో ముగియనుంది. 2013లో ఆరంభ టోర్నమెంట్ టైటిల్ నెగ్గిన టీమిండియా మరోసారి ఈ ట్రోఫీని ముద్దాడిన దాఖలాలు లేవు. గతంలో బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నమెంట్‌కు పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. శ్రీలంక జట్టు 2017, 2018లో రెండుసార్లు టైటిల్స్‌ను గెలిచింది. మొత్తం 8జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ టోర్నమెంట్‌లో ప్రతి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండుజట్లు సెమీస్‌కు అర్హత సాధించనున్నాయి. భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్-బిలో ఉండగా.. గ్రూప్-ఏలో శ్రీలంక, బంగ్లాదేశ్-ఏ జట్లు ఉన్నాయి.
గ్రూప్-ఏ: ఆఫ్ఘనిస్తాన్-ఏ, బంగ్లాదేశ్-ఏ, ఓమన్-ఏ, శ్రీలంక-ఏ
గ్రూప్-బి: ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ, నేపాల్-ఏ, యుఏఇ-ఏ
షెడ్యూల్..
జులై 13(గురు) శ్రీలంకాఏ × బంగ్లాదేశ్-ఏ ప్రేమదాస స్టేడియం
ఓమన్‌ాఏ × ఆఫ్ఘనిస్తాన్-ఏ కొలంబో
జులైా14(శుక్ర) యుఏఇాఏ × ఇండియాాఏ ఎస్‌ఎస్‌సి క్రికెట్ గ్రౌండ్
పాకిస్తాన్-ఏ × నేపాలాఏ కొలంబో
జులైా15(శని) ఓమన్-ఏ × బంగ్లాదేశ్-ఏ ఎస్‌ఎస్‌సి క్రికెట్ గ్రౌండ్
ఆఫ్ఘనిస్తాన్-ఏ × శ్రీలంకాఏ కొలంబో
జులై-17(సోమ) పాకిస్తాన్-ఏ × యుఏఇ-ఏ పి.సారా ఓవల్
నేపాల్-ఏ × ఇండియాాఏ ప్రేమదాస స్టేడియం
జులై-18 ఆఫ్ఘనిస్తాన్-ఏ × బంగ్లాదేశ్-ఏ పి.సారా ఓవల్
ఓమన్-ఏ × శ్రీలంకాఏ ప్రేమదాస స్టేడియం
జులై-19 యుఏఇాఏ × నేపాల్-ఏ పి.సారా ఓవల్
పాకిస్తాన్‌ాఏ × ఇండియాాఏ ప్రేమదాస స్టేడియం
జులై-21 సెమీఫైనల్-1 పి.సారా ఓవల్,
సెమీఫైనల్-2 ప్రేమదాస స్టేడియం
జులై-23 ఫైనల్ ప్రేమదాస స్టేడియం










