రాత్రి 7.30గం||ల నుంచి
డొమినిక: భారత్‌ావెస్టిండీస్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ అజింక్య రహానేలతో పటిష్టంగా ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యుటిసి) ఫైనల్లో ఓడిన అనంతరం టీమిండియా 2023ా25 ఛాంపియన్‌షిప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇక టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలో దిగిన ఫొటోలను బిసిసిఐ ట్విట్టర్‌లో మంగళవారం పోస్ట్ చేసింది. డబ్ల్యూటిసి ఫైనల్‌కు ముందు టీమిండియా టూల్ కిట్ స్పాన్సర్‌గా ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ కంపెనీ ఆడిడాస్‌తో బిసిసిఐ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు డొమినికా వేదికగా జరగనుంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటర్లు ఫామ్‌లో ఉండగా.. అనుభవం లేని బౌలింగ్ విభాగంతో భారత జట్టు విండీస్‌లో అడుగు పెట్టింది. ఇక విండీస్ ఆటగాళ్లు మెకంజీ, అథంజే, టెవిన్ ఇమ్లాచ్, జోర్డాన్, భారత ఆటగాళ్లలో ఇషాన్, జైస్వాల్, ముఖేష్, గైక్వాడ్‌కు తొలిసారి టెస్టుల్లో అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. భారతజట్టు వెస్టిండీస్ పర్యటనలో భాగంగా రెండు టెస్ట్‌లు, మూడు, వన్డేలతోపాటు మరో ఐదు టి20ల్లో తలపడనుంది.
జట్లు..
వెస్టిండీస్: బ్లాక్‌వుడ్, మెకంజీ, బ్రాత్‌వైట్, చంద్రపాల్, అథంజే, హోల్డర్, కార్న్‌వాల్, రైమన్ రైటర్, డిాశిల్వ, టెవిన్ ఇమ్లాచ్, జోర్డాన్, జోసెఫ్, వర్రికన్, కీమర్ రోచ్, గాబ్రియేల్.
భారత్: రహానే, రోహిత్ శర్మ, గైక్వాడ్, శుభ్‌మన్, కోహ్లి, జైస్వాల్, అక్షర్, అశ్విన్, జడేజా, ఇషాన్, శ్రీకర్ భరత్, ఉనాద్కట్, సిరాజ్, ముఖేశ్ కుమార్, సైనీ, శార్దూల్.










