Oct 07,2023 15:53

హైదరాబాద్‌: గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని అవమానకరంగా చిత్రీకరించారంటూ కాంగ్రెస్‌ నేతల నిరసనలు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో, పోలీసులు కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్నారు. గాంధీ భవన్‌ వద్దకు భారీ పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు, పోలీసులు మధ్య వాగ్వాదం తోపులాట చోటుచేసుకుంది. అనంతరం, గాంధీ భవన్‌ గేటుకు భారీకేడ్లు వేసి పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.