Jun 28,2023 09:26

ఐసిసి వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో మ్యాచ్‌లకు కేటాయించిన వేదికల్లోనూ బిసిసిఐ తెలుగు రాష్ట్రాలపై చిన్నచూపు చూపింది. మొత్తం 48 మ్యాచ్‌లు జరగనుండగా.. ఇందులో 9వేదికలకు ఐదేసి మ్యాచ్‌లు చొప్పున కేటాయించిన బిసిసిఐ.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటైన తెలంగాణకు మూడు మ్యాచ్‌లను మాత్రమే కేటాయించింది. అక్టోబర్‌ 6న పాకిస్తాన్‌-క్వాలిఫయర్‌-1, 9న న్యూజిలాండ్‌-క్వాలిఫయర్‌-1, 12న పాకిస్తాన్‌-క్వాలిఫయర్‌-2 జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో వైఎస్‌ఆర్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం ఉన్నా.. ఒక్క మ్యాచ్‌నూ కేటాయించలేదు. ఈ వివక్షను బిసిసిఐ వన్డే ప్రపంచకప్‌లోనే కాదు.. ఇటీవల ముగిసిన ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లోనూ చూపించింది.