May 11,2023 20:39
  • ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ మూడోస్థానంలో నిలిచింది. ఐసిసి గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్‌ 113పాయింట్లతో మూడో స్థానానికి పడిపోగా.. పాకిస్తాన్‌ జట్టు 116పాయింట్లతో రెండోస్థానానికి ఎగబాకింది. ఇక ఆస్ట్రేలియా జట్టు 118పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్తాన్‌ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 5-0తో చేజిక్కించుకోవడంతో ఆ జట్టు 112పాయింట్ల నుంచి ఏకంగా 116పాయింట్లకు ఎగబాకడంతో భారత్‌ ర్యాంక్‌ పడిపోయింది. ఐసిసి వార్షిక వన్డే పురుషుల టీమ్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అయిదు సార్లు వన్డే ప్రపంచకప్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా.. గత ఏడాది 113 పాయింట్ల నుంచి 118 పాయింట్లకు రేటింగ్‌ పెంచుకుంది. దీంతో పాకిస్థాన్‌పై స్వల్ప లీడింగ్‌ను సాధించింది. పాక్‌ 116, ఇండియా 115 పాయింట్లతో వరుసగా రెండో, మూడో స్థానంలో ఉన్నాయి.