- న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఓడిన శ్రీలంక
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 ఆఖరి టెస్టు ఫలితం తేలకముందే టీమిండియా శుభవార్తను అందుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో భారత్‌తో పోటీపడిన శ్రీలంక న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో లంకపై న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 285 పరుగుల లక్ష్యాన్ని 8 ఎనిమిది వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ ఛేదించింది. శ్రీలంక ఓడిపోవడంతో మనకు లైన్ క్లియర్ అయింది. ఆస్ట్రేలియాతో చివరిదైన నాలుగో టెస్టులో గెలుపోటములతో సంబంధం లేకుండా టీమిండియా ఫైనల్ బెర్తు దక్కించుకుంది. జూన్ లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక చివరి టెస్టులో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతూ లీడ్ పెంచుకుంటూ పోతోంది.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం 68.52 శాతంతో ఆసీస్ ఉండగా.. భారత్ 60.29 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే వెస్టిండీస్‌పై సిరీస్‌ను గెలిచిన దక్షిణాఫ్రికా 55.56 శాతంతో మూడో స్థానంలోకి వచ్చింది. ఇక కివీస్ చేతిలో తొలి టెస్టులో ఓటమిపాలైన శ్రీలంక 48.48 శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది.
#TeamIndia have qualified for the ICC World Test Championship Final for the second time in a row.
— BCCI (@BCCI) March 13, 2023
See you at The Oval 🙌🙌 pic.twitter.com/aMuHh28kGK










