న్యూఢిల్లీ : టాటా మోటార్స్ తన వాణిజ్య వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. కొత్త ఏడాది జనవరి నుంచి అన్ని రకాల వాణిజ్య వాహనాలపై 2 శాతం వరకు ధరలు పెరుగుతాయని పేర్కొంది. మోడల్‌ను బట్టి ధరల పెంపు ఉంటుందని తెలిపింది.










