Sep 06,2023 21:53
  • మెజారిటీ వాటా స్వాధీనానికి చర్చలు

న్యూఢిల్లీ : ప్రముఖ స్నాక్స్‌ తయారీ కంపెనీ హల్దీరామ్స్‌పై టాటా గ్రూపు కన్ను పడింది. ఆ సంస్థల్లోని మెజారిటీ వాటాలను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. హల్దీరామ్స్‌లో 51 శాతం వాటాల స్వాధీనానికి టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ కంపెనీ ఆసక్తి చూపుతోంది. కాగా.. హల్దీరామ్‌ 10 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.80వేల కోట్లు) విలువగా పేర్కొన్నట్లు సమాచారం. హల్దీరామ్స్‌ చెప్తోన్న విలువ చాలా ఎక్కువగా ఉందని.. అంత ఉండకపోవచ్చని టాటా గ్రూపు పేర్కొందని తెలుస్తోంది. కాగా.. ఈ వార్తలను టాటా గ్రూపు ప్రతినిధి కొట్టిపారేశారు. మరోవైపు హల్దీరామ్స్‌ దీనిపై స్పందించడానికి నిరాకరించింది. భారత స్నాక్స్‌ మార్కెట్‌లో హల్దీరామ్స్‌ 13 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది.