లండన్ : టాటా గ్రూపు బ్రిటన్‌లో విద్యుత్ వాహనాల బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటుకు భారీ పెట్టుబడులను ప్రకటించింది. ఆ దేశంలో 4 బిలియన్ పౌండ్లతో (దాదాపు రూ.42వేల కోట్లు) గిగా ప్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. టాటా గ్రూపు నిర్ణయంపై ఆ దేశ ప్రధాని రిషి సునాక్ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో తమ దేశంలో వేలాది సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయన్నారు. టాటా గ్రూపునకు చెందిన లగ్జరీ కార్లు తయారు చేసే జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) బ్రిటన్ కేంద్రంగా పని చేస్తోన్న విషయం తెలిసిందే.










