న్యూఢిల్లీ : టాటా గ్రూపు నిర్వహణలోని విమానయాన కంపెనీలు ఒకే గొడుగు కిందకు రానున్నాయని తెలుస్తోంది. విస్తారాతో పాటు ఎయిర్ ఆసియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను కూడా ఎయిరిండియాలోనే కలపడానికి టాటా సన్స్ ప్రణాళికలు రూపొందిస్తుందని సమాచారం. ఎఐ పునరుద్దరణలో భాగంగా విస్తారా బ్రాండ్‌ను పూర్తిగా రద్దు చేసుకునే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.










