తెలంగాణ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాలను తుది 'కీ'తో పాటు అధికారులు విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్ష ఫలితాలు చెక్ చేసుకోవడానికి https://tstet.cgg.gov.in/ లింక్ పై క్లిక్ చేయగలరు.
సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరగ్గా.. పేపర్-1కు 2.26 లక్షల మంది, పేపర్-2కు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష జరగనుంది.










