Sep 23,2023 11:56
  •  బలవంతంగా ఆళ్లగడ్డకు తరలించిన పోలీసులు

ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌ : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగం చేశారు. మూడు రోజుల నుంచి వారు నంద్యాలలోని ఆర్‌కె ఫంక్షన్‌ హాల్‌ వద్ద దీక్ష చేస్తున్న విషయం విదితమే. శనివారం తెల్లవారుజామున పోలీసులు దీక్షాస్థలికి చేరుకున్నారు. అఖిల ప్రియ, విఖ్యాత్‌రెడ్డి దీక్షను భగం చేసి బలవంతంగా వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో సెలైన్‌ బాటిళ్లు ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నించగా అందుకు వారు నిరాకరించారు. దీంతో అఖిల ప్రియ, విఖ్యాత్‌రెడ్డిని ఆళ్లగడ్డలోని తమ నివాసాలకు తరలించారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ.. ఇంటిలోనే దీక్ష చేపడుతామని ప్రకటించారు. దీక్షా శిబిరంలో కూర్చున్న తమ వారిపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు.