హైదరాబాద్ : బోయిన్‌పల్లిలోని ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఎపి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు టిడిపి అధినేత చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. కేసుకు సంబంధించి, ఆమె ఆరోగ్య పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, ఎన్ని కష్టాలు వచ్చినా మనో నిబ్బరంతో ముందుకు వెళ్లాలని ఆమెకు సూచించారు. ఇదే సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. బోయిన్‌పలి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ అరెస్ట్ అయి, దాదాపు రెండు వారాలకు పైగా చంచల్‌గూడ జైలులో ఉండి, నిన్న బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.










