ప్రజాశక్తి - కర్నూలు క్రైమ్ : కర్నూలు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టిడిపి నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు గుర్తించి వెంటనే ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అఖిలప్రియకు డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించారు. మెడికల్ రిపోర్టు కోసం జైలు అధికారులు వేచిచూస్తున్నారు. ఎవి సుబ్బారెడ్డిపై దాడి కేసులో భూమా అఖిలప్రియకు కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.










