Jul 13,2023 22:18

చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ మహిళల చేతిలో ఓటమి
మిర్పూర్‌: బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టు మూడో టి20లో పరాజయాన్ని చవిచూసింది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన చివరి టి20లో బంగ్లాదేశ్‌ నాలుగు వికెట్ల తేడాతో టీమిండియాపై గెలుపొందింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 102 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(40), జెమీమా రోడ్రిగ్స్‌(28) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. స్మృతి మంధాన(1), షెఫాలీ వర్మ(11)తో పాటు యస్టికా భాటియా(12), అమన్‌జోత్‌ కౌర్‌(2), పూజా వస్త్రాకర్‌(2), దీప్తి శర్మ(4), మిన్ను మణి(1) నిరాశపరిచారు. బంగ్లాదేశ్‌ బౌలర్లో రబెయ ఖాన్‌(3/16), సుల్తాన ఖాతున్‌(2/17), నహిదా అక్తర్‌, ఫహిమా ఖాతున్‌, షోర్నా అక్తర్‌ తలో వికెట్‌ తీసారు. ఆ లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ 18.2 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి ఛేదించింది. షమీమా సుల్తానా(42), నహిదా అక్తర్‌(10నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించారు. భారత బౌలర్లలో మిన్ను మణి, దేవికా వైద్య రెండేసి వికెట్లు తీయగా.. జెమీమా రోడ్రిగ్స్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. తొలి రెండు టి20ల్లో గెలిచిన హర్మన్‌ప్రీత్‌ సేన సిరీస్‌ను 2-1తో సిరీస్‌ను గెలుచుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ షమీమా సుల్తానాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు లభించాయి.