వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ మూడోరౌండ్‌లోకి టాప్ సీడ్, ఇగా స్వైటెక్ ప్రవేశించింది. బుధవారం జరిగిన రెండోరౌండ్ పోటీలో స్వైటెక్ 6ా2, 6ా0తో స్పెయిన్‌కు చెందిన టోర్మోపై వరుససెట్లలో గెలుపొందింది. ఇక 11వ సీడెడ్ క్రీడాకారిణి, రష్యాకు చెందిన కసట్క్సినా శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో కసట్క్సినా 6ా0, 6ా2తో అన్‌సీడెడ్ బుర్రాగే(బ్రిటన్)పై సునాయాసంగా గెలిచింది. మరో పోటీలో అమెరికాకు చెందిన కొలిన్స్ 6-4, 6-4తో గ్రాభెర్(ఆస్ట్రియా)పై, స్టెఫెన్స్(అమెరికా) 6ా2, 6ా3తో పేటర్సన్(స్వీడన్) వరుససెట్లలో గెలిచి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లారు.
ఇక పురుషుల సింగిల్స్‌లో 3వ సీడ్ మెద్వదెవ్, 21వ సీడ్ డిమిట్రోవ్ ప్రవేశించారు. తొలిరౌండ్‌లో మెద్వదెవ్ 7-5, 6-4, 6-3తో ఫెర్రీ(బ్రిటన్)పై, డిమిట్రోవ్ 6-1, 6-2, 6-1తో షిమా బుఛోరో(జపాన్)పై వరుససెట్లలో గెలిచి రెండోరౌండ్‌లోకి ప్రవేశించారు.










