న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్ఐసి తన రెండు పాలసీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎల్ఐసి జీవర్ అమర్, టెక్ టర్మ్ పాలసీలను విరమించుకుంటున్నట్లు బుధవారం వెల్లడించింది. నవంబర్ 23 నుంచి ఆ రెండు పాలసీలు వినియోగంలో ఉండవని స్పష్టం చేసింది. 2019 ఆగస్ట్‌లో జీవన్ అమర్ ప్లాన్, ఆ ఏడాది సెప్టెంబర్‌లో ఎల్ఐసి టెక్ టర్మ్ ప్లాన్లను ఆవిష్కరించింది. రీ ఇన్స్యూరెన్స్ ప్రీమియం ధరలు పెరగడం వల్లనే తొలగిస్తున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో ఈ రెండు పాలసీల్లో పలు మార్పులను చేసి మళ్లీ అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. కాగా.. ఇప్పటికే ఈ రెండు పాలసీలను కొనుగోలు చేసిన వారికి సేవలు కొనసాగుతాయని తెలిపింది. అయితే.. కొత్త పాలసీల జారీ ఉండదని స్పష్టం చేసింది.










