Feb 21,2023 22:09

తిరుపతి : టి20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌, టీమిండియా మిస్టర్‌ 360డిగ్రీస్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గుడి ఆవరణలో భార్య దేవిషతో కలిసి దిగిన ఫొటోలను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. టి20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.