హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఐపీఎల్-16వ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన రైజర్స్.. ఆదివారం పటిష్టమైన పంజాబ్ కింగ్స్‌ను ఢకొీట్టనుంది. తొలి రెండు మ్యాచ్‌లలో బ్యాటర్ల వైఫల్యంతో హైదరాబాద్‌కు పరాజయాలు తప్పలేదు. మెరుగైన బౌలింగ్ దళమున్నా స్వల్ప లక్ష్యాలను కాపాడుకోవడం వారి సామర్ధ్యానికి మించిన పనైంది. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం తమ పరాజయాలకు ముఖ్య కారణమని హెడ్ కోచ్ లారా అంగీకరించాడు. కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్మ్‌క్రూడా వారి తలరాతను మార్చలేకపోతున్నాడు. బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోన్న పంజాబ్ కింగ్స్‌ను,. పేస్ త్రయం భువనేశ్వర్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ ఎంత వరకు కట్టడి చేయగలరన్నది చూడాల్సిందే.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్): మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్(వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్): శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్










