- కోల్‌కతా చేతిలో ఐదు పరుగుల తేడాతో ఓటమి
హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేజేతులా ఓటమిపాలైంది. కోల్‌కతా నిర్దేశించిన 172పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ జట్టు చివరి వరకు పోరాడి 166పరుగులే చేయగల్గింది. హైదరాబాద్ విజయానికి చివరి 6బంతుల్లో 9పరుగులు చేయాల్సి రాగా.. వరణ్ చక్రవర్తి వేసిన బౌలింగ్‌లో కేవలం 3పరుగులే చేసి ఓటమిపాలైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శుభారంభం దక్కలేదు. స్టార్ బ్యాటర్ జేసన్ రారు(20) రాణించినా.. గుర్భాజ్(0), వెంకటేశ్ అయ్యర్(7) నిరాశపరిచారు. ఆ తర్వాత కెప్టెన్ నితీశ్ రాణా(42), రింకూ సింగ్(46), ఆండీ రస్సెల్(24) బ్యాటింగ్‌లో మెరిసారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ నరైన్(1), శార్దూల్ ఠాకూర్(8), అనుకుల్ రారు(13), హర్షీత్ రాణా (0)ను త్వరగా పెవీలియన్‌కు పంపడంలో సన్‌రైజర్స్ బౌలర్లు సఫలమయ్యారు. దీంతో కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 171పరుగులు చేసింది. జెన్సన్, నటరాజన్‌కు రెండేసి, భువనేశ్వర్, కార్తీక్ త్యాగీ, మార్‌క్రమ్, మార్ఖండేకు ఒక్కో వికెట్ దక్కాయి. ఛేదనలో సన్‌రైజర్స్ 54పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డా.. కెప్టెన్ మార్‌క్రమ్(41), క్లాసెన్(36) విజయతీరాలకు చేర్చినా.. లోయర్ ఆర్డర్స్ బ్యాటర్స్ నిరాశపరిచారు. శార్దూల్, అరో రాకు రెండేసి, వరుణ్ చక్రవర్తి, రాయ్, రస్సెల్, హర్షీత్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.











