చెన్నై: చెన్నై ఓపెన్ ఛాలెంజర్స్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లోకి సుమిత్ నాగల్ ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ పోటీలో సుమిత్ 3-6, 6-2, 6-0తో జాసన్ జంగ్(తైపీ)పై పోరాడి నెగ్గాడు. తొలి సెట్‌ను 3-6తో చేజార్చుకున్న సుమిత్.. ఆ తర్వాత రెండు సెట్‌లలో సంయుక్తంగా రాణించాడు. ఇక పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ-నెడుంఛెంజీయన్ జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్స్‌లో భారతజోడీ 7-6(7-5), 6-0తో భారత్‌కే చెందిన సుమిత్‌ాముకుంద్‌పై సునాయాసంగా గెలిచారు. అలాగే అర్జున్ ఖండే జోడీ కూడా 1-6, 7-6(10-8), 10-8తో కొరియా జోడీపై నెగ్గి సెమీస్‌కు చేరింది.










