Mar 15,2023 17:21

దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) తాజా ర్యాంకింగ్స్‌లో భారత సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఐసిసి బుధవారం విడుదల చేసి బౌలర్ల జాబితాలో అశ్విన్‌ అగ్రస్థానంలో నిలిచాడు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో అశ్విన్‌ 17.28 యావరేజ్‌తో మొత్తం 25వికెట్లు సాధించాడు. గత వారం ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌తో కలిసి టాప్‌లో నిలిచిన అశ్విన్‌.. తాజా ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌ ఒక్కడే అగ్రస్థానంలో నిలిచాడు. ఇక బ్యాటర్స్‌ జాబితాలో విరాట్‌ కోహ్లి ఏకంగా 7స్థానాలు మెరుగుపరచుకొని 13వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో టెస్ట మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి(186పరుగులు) సెంచరీ చేయడంతో అతని ర్యాంక్‌ మెరుగైంది. టెస్టుల్లో విరాట్‌ కోహ్లి 1205రోజుల తర్వాత సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ బ్యాటర్స్‌ జాబితాలో 8స్థానాలు మెరుగుపరచుకొని 44వ స్థానంలో నిలిచాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో అక్షర్‌ పటేల్‌ 264పరుగులు చేసి రాణించాడు.