మార్చి 31న ప్రారంభం.. మే 28న ఫైనల్
ఐపిఎల్-2023 షెడ్యూల్‌ను విడుదల చేసిన బిసిసిఐ
ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-15 షెడ్యూల్ వచ్చేసింది. భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) 2023 సీజన్ ఐపిఎల్ షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే పోరుతో ఐపిఎల్ 2023 సీజన్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30గం||లకు జరగనుంది. మే 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 12 వేదికల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్, మొహాలి, లక్నో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబయి, గౌహతి, ధర్మశాల వేదికలుగా మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక ముంబయి ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా ఏప్రిల్ 2న తొలి మ్యాచ్ జరగనుంది. ఐపిఎల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ముంబయి జట్టు చెన్నైతో తన రెండు మ్యాచ్‌లను ఏప్రిల్ 8, మే 6న పోటీపడనుంది. పది జట్లు పాల్గనే ఐపిఎల్ 2023 సీజన్‌లో మొత్తం 70లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. 10జట్ల మధ్య 18డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఇందులో ఏడేసి మ్యాచ్‌లను సొంత మైదానం, మరో 7 మ్యాచ్‌లు వెలుపల స్టేడియాల్లో ఆడాల్సి ఉంటుంది. గ్రూప్‌ాఏలో ముంబయి, రాజస్తాన్, కోల్‌కతా, ఢిల్లీ, లక్నో జట్లు, గ్రూప్‌ాబిలో చెన్నై, పంజాబ్, సన్‌రైజర్స్, బెంగళూరు, గుజరాత్ జట్లు ఉన్నాయి. ఒకేరోజు రెండు మ్యాచ్‌లు ఉంటే మధ్యాహ్నం 3.30గంటలకు, రాత్రి 7.30గంటలకు జరుగుతాయి.










