ప్రజాశక్తి- తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభంగా నిర్వహిస్తున్నారు. మూడో రోజైన బుధవారం ఉదయం మలయప్పస్వామి వారు సింహ వాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో కొలువుతీరారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తించారు. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. బుధవారం రాత్రి ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు అభయమిచ్చారు. వాహనసేవలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జెఇఒ వీరబ్రహ్మం, సివిఎస్‌ఒ నరసింహ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నపిల్లలకు జియో ట్యాగ్
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే చిన్నపిల్లలలు తప్పిపోకుండా టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఇఒ ఎవి.ధర్మారెడ్డి, జెఇఒ సదా భార్గవి, తిరుమల అదనపు ఎస్‌పి మునిరామయ్యతో కలిసి జియో ట్యాగింగ్ కట్టడం ప్రారంభించారు.










