ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
జకార్తా: ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లోకి కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ రాయ్ ప్రవేశించగా.. ప్రి క్వార్టర్స్‌లో పివి సింధు, ప్రియాంశు రాజ్‌వత్ ఓటమిపాలయ్యారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్‌ఫైనల్లో 7వ సీడ్ హెచ్‌ఎస్ ప్రణయ్ రాయ్ 21-18, 21-16తో లాంగ్-అంగ్వా(సింగపూర్)పై, కిదాంబి శ్రీకాంత్ 21-12, 22-20తో సహచర ఆటగాడు లక్ష్యసేన్‌పై వరుససెట్లలో గెలుపొందారు. మరో పోటీలో ప్రియాంశు రాజ్‌వత్ 22-20, 15-21, 15-21తో 2వ సీడ్ గింటింగ్(ఇండోనేషియా) చేతిలో పోరాడి ఓడాడు. ఇక మహిళల సింగిల్స్‌లో పివి సింధు 18-21, 16-21తో 3వ సీడ్, చైనీస్ తైపీకి చెందిన తై-జు-యింగ్ చేతిలో వరుససెట్లలో ఓటమిపాలైంది. ఇక పురుషుల డబుల్స్‌లో 7వ సీడ్ చిరాగ్‌శెట్టి-సాత్త్విక్ సాయిరాజ్ జోడీ 21-17, 21-16తో చైనాకు చెందిన హి-జి-టింగ్-జు హో డాంగ్‌పై విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు.










