Jul 07,2023 21:23

ముగిసిన ఐసిసి సూపర్‌6 క్వాలిఫయర్‌ పోటీలు
ఫైనల్లో తలపడనున్న శ్రీలంక, నెదర్లాండ్స్‌
హరారే: వన్డే ప్రపంచకప్‌ను రెండుసార్లు ముద్దాడిన వెస్టిండీస్‌కు చివరి మ్యాచ్‌లోనూ నిరాశ తప్పలేదు. శుక్రవాంర జరిగిన ఆఖరి సూపర్‌-6 పోటీలో శ్రీలంక చేతిలో వెస్టిండీస్‌ జటుట 8వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ జట్టు 48.1ఓవర్లలో 243పరుగులకు ఆలౌటైంది. కర్టీ(87), షెఫర్డ్‌(26), సింక్లేయిర్‌(25), ఛార్లెస్‌(39) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. తీక్షణకు నాలుగు, హేమంతకు రెండు, మధుశంక, శనక, పథీరణ, సాహన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో శ్రీలంక ఓపెనర్లు అదిరే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు నిస్సంక(104), కరుణరత్నే(83) 190పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు ఔటయ్యాక కుశాల్‌ మెండీస్‌(34), సమరవిక్రమే(17) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ తీక్షణకు లభించింది. నేటితో సూపర్‌-6 పోటీలు ముగియగా.. ఆదివారం ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన శ్రీలంక-నెదర్లాండ్స్‌ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.