- స్క్వాష్ ప్రపంచకప్ నేటినుంచే..
- నేడు హాంకాంగ్‌తో ఢీ
చెన్నై: 4వ స్క్వాష్ ప్రపంచకప్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. 13నుంచి 17వరకు చెన్నైలోని ఆల్-గ్లాస్ షో కోర్టులోని ఎక్స్‌ప్రెస్ ఎవెన్యూ మాల్‌లో ఈ టోర్నమెంట్ జరగనుంది. 2011 తర్వాత మరోసారి ప్రపంచకప్ స్క్వాష్‌కు భారత్‌కు ఆతిథ్యమివ్వనుంది. జూన్ 20నుంచి ఈజిప్ట్‌లోని కైరోలో సీజన్ ముగింపు పిఎస్‌ఏ వరల్డ్ టూర్ ఫైనల్స్ షెడ్యూల్ ఉన్న కారణంగా ఈ టోర్నీలో అగ్రశ్రేణి ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించడం లేదు. ప్రతి మ్యాచ్‌లో ఐదు గేమ్‌లలో 11పాయింట్లు సాధిస్తే ఆ గేమ్ గెలుపొందినట్లు. 6-6పాయింట్లతో సమంగా ఉంటే టై అవుతుంది. ఇందులో 7పాయింట్లతో నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 8జట్లు ఈ టోర్నమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈజిప్ట్‌కు టాప్‌సీడ్ లభించగా.. భారత్‌కు 2వ సీడింగ్ లభించింది. భారత్‌కు జపాన్ నుంచి ప్రధాన పోటీ ఎదురుకానుంది. భారత్‌తోపాటు హాంకాంగ్, జపాన్, దక్షిణాఫ్రికా, మలేషియా, ఆస్ట్రేలియా, కొలంబియాజట్లు పోటీపడుతున్నాయి. భారత్ తరఫున సౌరవ్ ఘోషల్, జోత్స్న చిన్నప్పతోపాటు అభరు సింఫ్‌ు బరిలోకి దిగనున్నారు. మంగళవారం జరిగే తొలిపోరులో భారతజట్టు హాంకాంగ్‌తో గ్రూప్ లీగ్ తొలి మ్యాచ్ ఆడనుంది. జపాన్-దక్షిణాఫ్రికాల మధ్య మరో మ్యాచ్ కూడా మంగళవారమే జరగనుంది.










