- టూరిజం శాఖ ప్రతిపాదనలకు భూయాజమాన్య సంస్థ పచ్చజెండా
- అరకు, కడప జిల్లాల్లో పలు ప్రాజెక్టులు
- సాగర తీర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర వ్యాప్తరగా పర్యాటక రంగ ప్రాజెక్టులకు భారీ మొత్తంలో భూములను కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పర్యాటక శాఖ సమర్పించిన ప్రతిపాదనలకు రెవెన్యూ శాఖ అధ్వర్యంలోని 'భూ యాజమాన్య సంస్థ (ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ' పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..మాచర్ల జిల్లాలోని నాగులావరంలో అతి పెద్ద మెగా టూరిజం ప్రాజెక్టు కోసం 250 ఎకరాల భూమి కేటాయించేవీలుంది. ఈ ప్రాంతంలోనే విలాసవంతమైన రిసార్ట్స్ నిర్మాణానికి మరో 20 ఎకరాలు కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
- రామాయపట్నం బీచ్‌లో సౌకర్యాల కల్పనకు 17.4 ఎకరాలు, తిరుపతి జిల్లాలోని తుప్పిలిపాలెంలో 3.2 ఎకరాలు, మొగల్తూరు మండలంలో బీచ్ రిసార్ట్స్‌కు 3 ఎకరాలు కేటాయిరచాలని ప్రతిపాదించారు.
- తిరుపతి జిల్లాలోని రాష్ట్ర సరిహద్దుగా ఉన్న తడ ప్రారతంలో ప్రత్యేక పర్యాటాభివృద్ధికి 80 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. కడప జిల్లా లెక్కలవారిపల్లిలో ఇరటిగ్రేటెడ్ పర్యాటక అభివృద్ధి కోసం 50 ఎకరాలు, అరకులోయలోని గ్రామాల్లో పర్యాటకాభివృద్ధి పేరిట 60 ఎకరాలను కేటాయిరచాలని ప్రతిపాదిరచారు.
- పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు మండలంలో బీచ్ రిసార్ట్‌కిరద మూడు ఎకరాలు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలంలోని పొన్నాడలో టూరిజం పార్క్ ఏర్పాటుచేసేరదుకు, విశాఖ జిల్లాలోని ఎరడాడ, విశాఖ పట్టణంలో బీచ్ రిసార్ట్‌లకు ఎనిమిది ఎకరాలు, మధురవాడలో బీచ్ రిసార్ట్‌లకు 10 ఎకరాలు, భీమిలి మండలం నేరెళ్లవలసలో 1.8 ఎకరాలను కేటాయిరచాలని నిర్ణయించారు. ప్రకాశం జిల్లాలోని అన్నంగి, పాకాలలో పర్యాటకాభివృద్ధికి 28 ఎకరాలు కేటాయిరనున్నారు.
- నంధ్యాల జిల్లాలోని వాల్మీకి గుహల ప్రారతంలో పర్యాటకానికి 26.5 ఎకరాలు, అదే జిల్లాలోని బేతంచర్ల ప్రారతంలో ఉన్న బిల్లసుర్గం గుహల పర్యాటకానికి మరో 21 ఎకరాలు కేటారచనున్నారు. త్వరలోనే పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టులను రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.










