వెస్ట్‌జోన్ 129/7
దులీప్ ట్రోఫీ ఫైనల్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్ జట్టు పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 213పరుగులకే పరిమితమైన సౌత్‌జోన్ జట్టు.. రెండోరోజు వెస్ట్‌జోన్‌ను 129పరుగులకే 7వికెట్లు కూల్చి పట్టు బిగించింది. సౌత్‌జోన్ ఓవర్‌నైట్ బ్యాటర్స్ వాషింగ్టన్ సుందర్(22), వైశక్(13) బ్యాటింగ్‌లో రాణించగా.. విద్వత్(8), కౌశిక్(0) నిరాశపరిచారు. దీంతో సౌత్ జోన్ జట్టు 78.4ఓవర్లలో 213పరుగులకే పరిమితమైంది. ములానీకి మూడు, నగ్వాస్వల్లా, చింతన్ గాజా, ధర్మేంద్రసింగ్ జడేజాకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం వెస్ట్‌జోన్ ఓపెనర్ పృధ్వీ షా(65) అర్ధసెంచరీతో రాణించినా.. మిగతా బ్యాటర్స్ నిరాశపరిచారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ధర్మెంద్రసింగ్ జడేజా(4), లలిత్ సేఠ్(5) క్రీజ్‌లో ఉన్నారు. కవిరప్పకు నాలుగు, వైశక్‌కు రెండు వికెట్లు దక్కాయి.










