బెంగళూరు: దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్ బ్యాటర్లు తడబడ్డారు. వెస్ట్ జోన్‌తో బుధవారం నుంచి ప్రారంభమైన ఫైనల్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్‌జోన్ 65ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్(9బ్యాటింగ్), విజరుకుమార్ వైశాఖ్(5బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. వెస్ట్‌జోన్ బౌలర్లలో అర్జన్ నగ్వాస్వల్లా, చింతన్ గజా, ములాని రెండేసి వికెట్లు తీయగా.. అతిత్ షేత్ ఓ వికెట్ పడగొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్‌కు వెస్ట్ జోన్ బౌలర్లు తొలినుంచే కట్టడి చేశారు. మొదటి సెషన్‌లోనే ఓపెనర్లు రవికుమార్ సమర్థ్(7), మయాంక్ అగర్వాల్(28)లను పెవిలియన్ చేర్చారు. కెప్టెన్ హనుమ విహారి(63), తిలక్ వర్మ(40) జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. హనుమ విహారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 103 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విహారికి ఇది 46వ ఫస్ట్ క్లాస్ అర్ధ సెంచరీ. విహారిని ములాని క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో విహారి 6వ వికెట్‌గా వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్, విజరు కుమార్ వైశాక్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి రోజు ఆటను ముగించారు. వెలుతుఉ లేమి కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముందే నిలిపివేశారు.










