టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి 'జెడ్' కేటగిరీ భద్రత కల్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. గంగూలీకి ప్రస్తుతమున్న 'వై' కేటగిరీ భద్రత పదవీకాలం మే 16తో ముగియడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాదా భద్రతను 'వై' నుంచి 'జెడ్' కేటగిరీకి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మమతా సర్కార్ నిన్న అధికారికంగా వెల్లడించింది. జెడ్ కేటగిరీ భద్రత ప్రకారం ఇకపై గంగూలీ భద్రత దళం సంఖ్య ఎనిమిది నుండి పది మంది పోలీసు అధికారులతో (24 గంటల పాలు) కూడినది ఉండనుంది.










