అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని ఎపి హైకోర్టులో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ వేశారు. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందుకు వచ్చింది. పిటిషన్ ను హైకోర్టు రిజిస్ట్రీ చీఫ్ జస్టిస్ బెంచ్ కు కేటాయించింది. అయితే, ఈ పిల్ ను విచారించేందుకు తమ ఇద్దరు జడ్జిల్లో ఒకరికి అభ్యంతరం ఉందని చీఫ్ జస్టిస్ తెలిపారు. వెంటనే పిటిషన్ ను మరో బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు.










