May 10,2023 09:43
  • బెంగళూరుపై ఏడు వికెట్ల తేడాతో ముంబయి గెలుపు
  • ప్లే-ఆఫ్‌ ఆశలు సజీవం

ముంబయి : ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-16లో ముంబయి ఇండియన్స్‌ ప్లే-ఆఫ్‌ ఆశలు సజీవం చేసుకుంది. మంగళవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)పై ఆరు వికెట్ల తేడాతో గెలిచి 12 పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి ఎగబాకింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 199పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో ముంబయి జట్టు 16.3ఓవర్లలో కేవలం 4వికెట్లు కోల్పోయి 200పరుగులు చేసి ఘన విజయం సాధించింది. తొలుత బెంగళూరు 13పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ అర్ధసెంచ రీలతో కదం తొక్కారు. డుప్లెసిస్‌ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేయగా... మ్యాక్స్‌ వెల్‌ 33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు కొట్టాడు. వీరిద్దరూ అవుటయ్యాక దినేశ్‌ కార్తీక్‌ 18 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు. ఓసారి లైఫ్‌ లభించడంతో దాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌ మన్‌ వీలైనన్ని పరుగులు జోడించాడు. ముంబయి ఇండియన్స్‌ బౌలర్లలో జాసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌కు మూడు, కామెరాన్‌ గ్రీన్‌, క్రిస్‌ జోర్డాన్‌, కుమార్‌ కార్తికేయకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో ముంబయి జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(7) నిరాశపరిచినా.. ఇషాన్‌ కిషన్‌(42), సూర్యకుమార్‌ యాదవ్‌(83; 35బంతుల్లో 7ఫోర్లు, 6సిక్సర్లు) రాణించాడు. వధేరా(52నాటౌట్‌; 34బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) ముంబయి గెలుపులో కీలకపాత్ర పోషించారు. హసరంగ, వ్యాషక్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు లభించింది.
 

                                                             ఆర్చర్‌ ఔట్‌.. జోర్డాన్‌ ఇన్‌..

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు గట్టి ఎదురుదబెబ తగిలింది. పేస్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఆ జట్టుకు దూరం అయ్యాడు. ఈ సీజన్‌లోని మిగ తా మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడం లేదని ముంబయి ఇండియన్స్‌ ట్వీట్‌ చేసింది. ఆర్చర్‌ స్వదేశానికి వెళ్తున్నట్లు, ఈసిబి పర్యవేక్షణలో ఆర్చర్‌ గాయానికి చికిత్స కొనసాగుతుందని ఆ ట్వీట్‌లో పేర్కొంది. ముంబయి ఇండియన్స్‌ రూ.2 కోట్లు కొనుగోలు చేసింది.

స్కోర్‌బోర్డు..
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి)ఇషాన్‌ కిషన్‌ (బి)బెహ్రెన్‌డార్ఫ్‌ 1, డుప్లెసిస్‌ (సి) సబ్‌ విష్ణు వినోద్‌ (బి)గ్రీన్‌ 65, అనుజ్‌ రావత్‌ (సి)గ్రీన్‌ (బి)బెహ్రెన్‌డార్ఫ్‌ 6, మ్యాక్స్‌వెల్‌ (సి)నెహల్‌ (బి)బెహ్రెన్‌డార్ఫ్‌ 68, లామ్రోర్‌ (బి)కార్తికేయ 1, దినేశ్‌ కార్తీక్‌ (సి)నేహల్‌ వథేరా (బి)జోర్డాన్‌ 30, కేదర్‌ జాదవ్‌ (నాటౌట్‌) 12, హసరంగ (నాటౌట్‌) 12, అదనం 4. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 199పరుగులు. వికెట్ల పతనం: 1/2, 2/16, 3/136, 4/143, 5/146, 6/185 బౌలింగ్‌: బెహ్రెన్‌డార్ఫ్‌ 4-0-36-3, పియూష్‌ చావ్లా 4-0-41-0, గ్రీన్‌ 2-0-15-1, జోర్డాన్‌ 4-0-48-1, కార్తికేయ 4-0-35-1, ఆకాశ్‌ మథ్వల్‌ 2-0-23-0.

table