దుబాయ్: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్ విభాగంలో భారత్ పోరు ముగిసింది. క్వార్టర్స్‌కు చేరి ఆశలు రేపిన పివి సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్ రాయ్ ఓటమిపాలయ్యారు. మహిళల సింగిల్స్‌లో 8వ సీడ్ పివి సింధు 21-18, 5-21, 9-21తో 2వ సీడ్, కొరియాకు చెందిన సన్-యుాయంగ్ చేతిలో పోరాడి ఓడింది. తొలి సెట్‌ను కైవసం చేసుకున్న సింధు.. రెండు, మూడు సెట్‌లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇక పురుషుల సింగిల్స్‌లో 8వ సీడ్ ప్రణయ్ రాయ్ 11-21, 9-13తో సునేయమ(జపాన్) చేతిలో వెనుకబడి ఉన్న దశలో గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. దీంతో సునేయమ విజేతగా నిలిచి సెమీస్‌కు చేరాడు.










