బెంగళూరు : భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీ వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 17) నుంచి ప్రారంభం కానుంది. రెండో టెస్ట్‌కు టీమ్ ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తోన్నాయి. వెన్నుగాయం తగ్గకపోవడంతో రెండో టెస్ట్‌కు కూడా అతడిని పక్కనపెట్టబోతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అతడు ఓవరాల్‌గా ఆసీస్‌తో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమమ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే శ్రేయస్ మళ్లీ తిరిగి జట్టులో చేరే ముందు తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అతడు దేశీవాళీ టోర్నీ ఇరానీ కప్‌లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రేయస్ నేషనల్ క్రికెట్ అకాడెమీలో చికిత్సను తీసుకుంటున్నాడు.తన ట్రైనింగ్ సెషన్‌కు సంబంధించిన ఫొటోలను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.










