Mar 25,2023 22:06

ఛండీగడ్‌: పంజాబ్‌ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు, వికెట్‌ కీపర్‌ జానీ బెయిర్‌స్టో ఈ సీజన్‌ ఐపిఎల్‌కు దూరమయ్యాడు. ఈ మేరకు పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ ట్విటర్‌ వేదికగా త్వరలో జరిగే ఐపిఎల్‌-2023కు బెయిర్‌స్టో గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడని, అతని స్థానంలో ఆడిలైడ్‌ స్ట్రయికర్‌ షార్ట్‌ జట్టుతో జత కట్టనున్నాడని వెల్లడించింది. 33ఏళ్ల బెయిర్‌స్టోను 2022 సీజన్‌కు పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ 9.75కోట్లకు కొనుగోలు చేయగా.. గత సీజన్‌లో 11 ఇన్నింగ్స్‌లో 144.57స్ట్రయికర్‌ రేట్‌తో 253పరుగులు చేశాడు. ఇక 27ఏళ్ల షార్ట్‌ గత సీజన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో 14ఇన్నింగ్స్‌లో 144.0 స్ట్రయిక్‌రేట్‌తో 458 చేశాడు.