కోల్‌కతాపై ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపు
కోల్‌కతా: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ హ్యాట్రిక్ విజయాలతో మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లు నష్టపోయి 179పరుగులు చేయగా.. ఛేదనలో గుజరాత్ జట్టు 17.5ఓవర్లలో కేవలం 3వికెట్లు కోల్పోయి 180పరుగులు చేసి విజయం సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో విజయ్ శంకర్(51నాటౌట్) అర్ధసెంచరీకి తోడు శుభ్‌మన్ గిల్(49), డేవిడ్ మిల్లర్(32 నాటౌట్) రాణించారు. తొలుత గుజరాత్‌కు శుభారంభం దక్కలేదు. 23 పరుగుల వద్ద ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(10) ఔటయ్యాడు. హర్షిత్ రానా కెప్టెన్ హార్దిక్ పాండ్యా(26) ఎల్బీగా వెనక్కి పంపాడు. ఆ తర్వాత విజరు శంకర్, డేవిడ్ మిల్లర్ ధనాధన్ ఆడడంతో గుజరాత్ మరో రెండు ఓవర్లు ఉండగానే గెలుపొందింది. అంతకుముందు సొంత మైదానంలో కోల్‌కతా ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్(81) విధ్వంసక బ్యాటింగ్ చేశాడు. చివర్లో ఆండ్రూ రస్సెల్(34) చెలరేగడంతో కోల్‌కతా 7వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లోనూ కెప్టెన్ నితీశ్ రానా పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచాడు. టాస్ ఓడిన కోల్‌కతాను షమీ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ జగదీశన్(19)ను శార్థూల్ ఠాకూర్(0)ను డకౌట్ చేశాడు. జోష్ లిటిల్ ఒకే ఓవర్లో వెంకటేశ్ అయ్యర్(11), కెప్టెన్ నితీశ్ రానా(4)నె పెవిలియన్ పంపి కోల్‌కతాను దెబ్బకొట్టాడు. షమీకి మూడు, జోష్ లిట్టిల్, నూర్ అహ్మద్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు..
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: జగదీశన్ (ఎల్‌బి)షమీ 19, గుర్బాజ్ (సి)రషీద్ ఖాన్ (బి)నూర్ అహ్మద్ 81, శార్దూల్ ఠాకూర్ (సి)మోహిత్ శర్మ (బి)షమీ 0, వెంకటేశ్ అయ్యర్ (ఎల్‌బి)లిట్టిల్ 11, నితీశ్ రాణా (సి)తెవాటియా (బి)లిట్టిల్ 4, రింకూ సింగ్ (సి)లిట్టిల్ (బి)నూర్ అహ్మద్ 19, ఆండీ రస్సెల్ (సి)తెవాటియా (బి)షమీ 34, విసే (నాటౌట్) 8, అదనం 3. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 179పరుగులు.
వికెట్ల పతనం: 1/23, 2/47, 3/84, 4/88, 5/135, 6/156, 7/179
బౌలింగ్: షమీ 4-0-33-3, హార్దిక్ పాండ్యా 3-0-34-0, రషీద్ ఖాన్ 4-0-54-0, లిట్టిల్ 4-0-25-2, నూర్ అహ్మద్ 4-0-21-2, మోహిత్ శర్మ 1-0-12-0
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: వృద్ధిమాన్ సాహా (సి)హర్షీద్ రాణా (బి)రస్సెల్ 10, శుభ్‌మన్ (సి)రస్సెల్ (బి)నరైన్ 49, హార్దిక్ పాండ్యా (ఎల్‌బి)హర్షీత్ రాణా 26, విజరు శంకర్ (నాటౌట్) 51, డేవిడ్ మిల్లర్ (నాటౌట్) 32, అదనం 12. (17.5ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 180పరుగులు.
వికెట్ల పతనం: 1/41, 2/91, 3/93
బౌలింగ్: హర్షీత్ రాణా 3-0-25-1, ఆండీ రస్సెల్ 3-0-29-1, వరణ్ చక్రవర్తి 4-0-42-0, సూర్యాంష్ శర్మ 4-0-37-0, సునీల్ నరైన్ 3-0-24-1, నితీశ్ రాణా 0.5-0-14-0










