కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ అంత విఫలమైన వేళ శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ రెచ్చిపోయారు. శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ విజంభణతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కేకేఆర్ ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్(57) రాణించాడు. ఓ దశలో కోల్ కతా జట్టు 11.3 ఓవర్లలో 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వెంకటేశ్ అయ్యర్ (3), మన్ దీప్ సింగ్ (0), కెప్టెన్ నితీశ్ రాణా (1), ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ (0) పెవిలియన్ చేరారు. దాంతో, కోల్‌కతా 150 ప్లస్ చేయడమే గొప్ప అనిపించింది. కానీ, శార్దూల్ ఠాకూర్ క్రీజులోకి వచ్చాక సీన్ మారింది. శార్దూల్ ఠాకూర్ కేవలం 29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో శార్ధూల్‌కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం.రింకూ సింగ్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. రింకూ, శార్దూల్ ఆరో వికెట్‌కు 103 రన్స్ జోడించారు. ఆర్‌సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లే, కర్ణ్ శర్మలు చెరో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, హర్షల్ పటేల్, ఆకాశ్‌దీప్‌లు తలా ఒక వికెట్ తీశారు.










