Feb 17,2023 22:15

ఆస్ట్రేలియా 263పరుగులకు ఆలౌట్‌
బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ

న్యూఢిల్లీ: రెండో టెస్టులోనూ భారత స్పిన్నర్ల జోరు కొనసాగింది. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా స్పిన్‌ మాయాజాలానికి ఆస్ట్రేలియా జట్టు 263 పరుగులకు ఆలౌట్‌ అయింది. టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు జట్టు స్కోర్‌ 50 పరుగులవద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. డేవిడ్‌ వార్నర్‌(15) తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌ చేరాడు. మరో ఓపెనర్‌ ఖవాజా(81) అర్ధసెంచరీతో రాణించినా.. స్పిన్‌ మాత్రికుడు అశ్విన్‌ ఒకే ఓవర్‌లో లబూషేన్‌, స్మిత్‌ను ఔట్‌ చేసి ఆసీస్‌ను దెబ్బతీశాడు. ఆ తర్వాత ట్రావిస్‌ హెడ్‌(12)ను షమీ.. అలెక్స్‌ క్యారీ(0) అశ్విన్‌ ఔట్‌ చేయడంతో.. ఆస్ట్రేలియా జట్టు 199కే 6 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడింది. ఆ దశలో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌(72). ఒకవైపు వికెట్లు పడుతున్నా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. టెయిలెండర్లతో కలిసి జట్టు జట్టు స్కోర్‌ను 250కు దాటించాడు. ఏడో వికెట్‌కు కమిన్స్‌, హ్యాండ్స్‌కోంబ్‌ కలిసి 59 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా ఒకే ఓవర్‌లో కమిన్స్‌, మర్ఫీని ఔట్‌ చేసి ఆసీస్‌ను దెబ్బతీశాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ పని షమీ చూసుకున్నాడు. లియాన్‌, కుహ్నెమన్‌ను బౌల్డ్‌ చేయడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 263 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారతజట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ(13), కేఎల్‌ రాహుల్‌(4) క్రీజ్‌లో ఉన్నారు.
స్కోర్‌బోర్డు..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: డేవిడ్‌ వార్నర్‌ (సి)భరత్‌ (బి)షమీ 15, ఖవాజా (సి)రాహుల్‌ (బి)జడేజా 81, లబూషేన్‌ (ఎల్‌బి)అశ్విన్‌ 18, స్మిత్‌ (సి)భరత్‌ (బి)అశ్విన్‌ 0, హెడ్‌ (సి)రాహుల్‌ (బి)షమీ 12, హ్యాండ్‌కోంబ్‌ (నాటౌట్‌) 72, క్యారీ (సి)కోహ్లి (బి)అశ్విన్‌ 0, కమిన్స్‌ (ఎల్‌బి)అశ్విన్‌ 33, మర్ఫీ (బి)జడేజా 0, లియాన్‌ (బి)షమీ 10, కుహ్నేమన్‌ (బి)షమీ 6, అదనం 16. (78.4ఓవర్లలో ఆలౌట్‌) 263పరుగులు.
వికెట్ల పతనం: 1/50, 2/91, 3/91, 4/108, 5/167, 6/168, 7/227, 8/227, 9/246, 10/263
బౌలింగ్‌: షమీ 14.4-4-60-4, సిరాజ్‌ 10-2-30-0, అశ్విన్‌ 21-4-57-3, జడేజా 21-2-68-3, అక్షర్‌ 12-2-34-0.
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (బ్యాటింగ్‌) 13, కేఎల్‌ రాహుల్‌ (బ్యాటింగ్‌) 4, అదనం 4. (9 ఓవర్లలో) 21పరుగులు.
బౌలింగ్‌: కమిన్స్‌ 3-1-7-0, కుహ్నేమన్‌ 4-1-6-0, లియాన్‌ 2-0-4-0