మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గెలుచుకున్నాడు. మార్చి నెలలో వివిధ ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనకు గాను షకీబ్‌ను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, యూఏఈ క్రికెటర్ ఆసిఫ్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ ఉండినప్పటికీ, అంతిమంగా జ్యూరీ షకీబ్‌వైపే మొగ్గుచూపింది. మార్చి నెలలో 12 మ్యాచ్‌లు ఆడిన షకీబ్ 353 పరుగులు తీసి 15 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు గెలవడం ఇది రెండోసారి. 2021 జులైలో షకీబ్ ఈ అవార్డును తొలిసారి గెలుచుకున్నాడు.










