ముంబయి : సెన్సెక్స్ 51 పాయింట్ల కంటే దిగువనే ముగిసి సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాలను చవి చూశాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 51.10 పాయింట్లు లేదా 0.08 శాతం క్షీణించి 62,130.57 వద్దకు చేరుకుంది. ఇక ఎన్‌ఎస్‌ఇ 0.55 పాయింట్లు స్వల్పంగా పెరిగి.. 18,497.15 వద్ద ముగిసింది. ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, టైటాన్, కోటక్ మహీంద్రాబ్యాంక్, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి వెనుకబడి ఉన్నాయి. లాభాల బాటలో టాటా స్టీల్, నెస్లే, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లు ఉన్నాయి. ఆసియాలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్‌లలో ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.










