Dec 23,2022 21:34

హైదరాబాద్‌ : ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ బిగ్‌ సి తన 20వ వార్షికోత్సవం సందర్బంగా ప్రకటించిన ఆఫర్లలో భాగంగా తొలి లక్కీ డ్రాను నిర్వహించింది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలోని విజేతలను ప్రకటించింది. తొలి లక్కీ డ్రాలో ఆరు చొప్పున మారుతి సుజుకి ఆల్టో కార్లు, బజాజ్‌ ప్లాటినా బైకులు, రిఫ్రిజిరేటర్లు, ఎసిలు, టివిల విజేతలను ప్రకటించింది. 30 మంది విజేతలను ఎంపిక చేసింది. వార్షికోత్సవ ఆఫర్‌లో భాగంగా 20 చొప్పున మారుతి సుజుకి ఆల్టో కార్లు, బజాజ్‌ ప్లాటినా బైకులు, రిఫ్రిజిరేటర్లు, ఎసిలు, టివిలను విజేతాలకు అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మిగిలిన వాటి కోసం మరో రెండు దఫాల్లో లక్కీడ్రాను నిర్వహించనున్నట్లు బిగ్‌ సి సిఎండి బాలు చౌదరీ తెలిపారు. లక్కీ డ్రా విజేతలతో పాటుగా బిగ్‌ సిలో చేసే ప్రతీ కొనుగోలుపై డిస్కౌంట్‌తో పాటుగా ఖచ్చితమైన బహుమతిని అందిస్తున్నామన్నారు. తొలి లక్కీడ్రాలో సి గోపాల క్రిష్ణా, రితేష్‌ కుమార్‌ ఝా, ఎం రాజు, పర్వేజ్‌ అహ్మాద్‌, లికిత్‌, అఖిల్‌ అల్టో కారులను గెలుపొందిన వారిలో ఉన్నారు.