ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయనున్న నీటిపారుదల ప్రాజెక్టుల సందర్శన యాత్రకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా కల్పించాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డిజిపికి ఆయన లేఖ రాశారు. గత ప్రభుత్వంలో చేపట్టిన అనేక నీటి పారుదల ప్రాజెక్టులు, తాగునీటి పధకాలను వైసిపి ప్రభుత్వం నిలిపివేసిందని, పొలాలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతుల భాధలు దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన చేపట్టారని వర్ల రామయ్య పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు భద్రతపై అనేక వైఫల్యాలు చోటుచేసుకున్నాయని, కొంతమంది పోలీసు అధికారులు కొన్ని దురుద్ధేశాలతో భద్రతా ఏర్పాట్లను సరిగా చేయడం లేదని లేఖలో పేర్కొన్నారు.
- కొవ్వూరు ఆర్‌డిఓపై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్‌డిఓ కేంద్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘిస్తున్నారని టిడిపి కార్యాలయ కార్యదర్శి పరుయూరి అశోక్‌బాబు పేర్కొన్నారు. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసరు ముకేష్‌కుమార్‌మీనాకు మంగళవారం ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తెలుగుదేశం బూత్ లెవల్ ఏజెంట్లను బూత్ లెవల్ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు










