Aug 15,2023 21:01

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ఓ గ్రామంలో దళిత మహిళపై ఐదుగురు వైసిపి నాయకులు గ్యాంగ్‌ రేప్‌ చేసిన విషయంలో సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిగ్గుతో తలదించుకుంటారా? అని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత మహిళపై అత్యాచారం చేసిన వారిలో రాష్ట్ర మంత్రి ఉషశ్రీచరణ్‌ సన్నిహితుడు, వలంటీరుకు సోదరుడు హరి ఆ ఘటనలో భాగస్వామి అని తెలుస్తోందన్నారు. వైసిపి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందన్నారు. దళితులను చంపినా, నరికినా, శిరోముండనం చేసినా, అత్యాచారాలు జరుగుతున్నా, ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. గ్యాంగ్‌రేప్‌ ఘటన పట్ల నిర్లక్ష్యం వహించిన డిఎస్‌పి, స్థానిక ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.