వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు పట్టు బిగిస్తోంది. శనివారం ఇంగ్లండ్‌జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 8వికెట్ల నష్టానికి 435పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించగా.. రెండోరోజు ఆట నిలిచే సమయానికి 138పరుగులకే 7 వికెట్లను పడగొట్టి పై చెయ్యి సాధించింది. న్యూజిలాండ్ జట్టు ఓపెనర్ లాథమ్:(35), నికోలస్(30) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. రెండోరోజు ఆట నిలిచే సమయానికి బ్లండెల్(25), సౌథీ(23) క్రీజ్‌లో ఉండగా.. ఆండర్సన్, లీచ్‌కు మూడేసి వికెట్లు దక్కాయి. న్యూజిలాండ్ జట్టు ఇంకా 297పరుగులు వెనుకబడి ఉంది. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే 1ా0 ఆధిక్యతలో ఉంది.










