Mar 25,2023 22:02

స్విస్‌ ఓపెన్‌ సూపర్‌300
బస్సెల్‌(స్విట్జర్లాండ్‌): స్విస్‌ ఓపెన్‌ సూపర్‌300 బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీఫైనల్లోకి భారత పురుషుల డబుల్స్‌ జోడీ ప్రవేశించింది. శుక్రవారం రాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్లో సాత్త్విక్‌ సాయిరాజ్‌ాచిరాగ్‌ శెట్టి జోడీ 15-21, 21-11, 21-14తో డెన్మార్క్‌కు చెందిన జప్సే బే-లస్సె మొథెడేలపై పోరాడి నెగ్గారు. తొలి గేమ్‌ను కోల్పోయిన భారత జంట.. రెండు, మూడు గేమ్‌లలో అద్భుతంగా పుంజుకొని మ్యాచ్‌ను గెలుపొందడం విశేషం. ఈ మ్యాచ్‌ సుమారు 54నిమిషాలసేపు సాగింది. ఈ టోర్నమెంట్‌లో పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగాల్లో భారత షట్లర్ల పోరాటం ముగిసిన సంగతి తెలిసిందే.