భోపాల్: 4వ జాతీయ షూటింగ్ సెలెక్షన్ ట్రయల్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, అనురాధ అగ్రస్థానంలో నిలిచారు. భోపాల్‌లోని మధ్యప్రదేశ్ అకాడమీలో జరుగుతున్న జాతీయ షూటింగ్ పోటీల్లో సరజ్‌జ్యోత్(586) 16-12పాయింట్ల తేడాతో అర్జున్ సింగ్ ఛీమాపై విజయం సాధించాడు. రెండుసార్లు ప్రపంచకప్ స్వర్ణ పతక విజేత, ఆసియా క్రీడల ఛాంపియన్ సౌరభ్ చౌదరి 582పాయింట్లతో 8వ స్థానానికే పరిమితమయ్యాడు. అలాగే మహిళల ఎయిర్ పిస్టల్‌లో అనురాధ దేవి 17-11పాయింట్ల తేడాతో పలక్ ఘులియాపై గెలిచి కెరీర్‌లో తొలిసారి షూటింగ్ పోటీల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇక మనుభకర్ 0.3పాయింట్ల వ్యత్యాసంతో మూడోస్థానానికే పరిమితమైంది. ఇక ఒలింపియన్ నేహా(13), యశస్విని సింగ్ దేశ్వాల్(15) స్థానాల్లో నిలిచారు. వీరి ఖాతాలో 571పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇక రిథమ్ సింఘ్వాన్ 570పాయింట్లతో 19వ స్థానానికే పరిమిమైతంది.










